హోమ్Purushotthamu.C 477 1 సృష్టికర్త ప్రస్తుతి రాగం:కాంభోజి తాళం:ఆట ఏది నా విశ్రాంతి యీ లోకమందు నే దిక్కు గనుగొన్న లేదు సుఖ మెందు మేదురా మోద ని త్యోదగ్ర మోక్ష పుట భేదమున చొరకున్న లేదు సుఖ మెచట ||నేది||కష్టములు తెరతెరలు గా వచ్చిన మదాత్మ దృష్టి దప్పక యోర్చి తీరమంద వలయున్ స్పష్టమగు నా త్రోవ పయనంబు తుద ముట్టు శ్రేష్ఠ మగు నా యిల్లు చేరు నందాక ||నేది||కోరింద పొదచుట్టు కొనియుండ నిమ్ము నే గోర నిచట గులాబి కుసుమ శయనంబు నేరీతినైన నా యేసు రొమ్మున జేరి భూరిసుఖ మొందెద వి చార మిక నేల ||నేది||యేసుప్రియ మించు కే నెఱిగి కన్గొను వేళ నా సంతసము నిండు పాసి చనె వెతలు భాసురంబుగ మంచు పగిది దళ తళలాడ జేసె నా కన్నీళ్లు చింత లెడబాపి ||యేది||ఉండునే సందియము లుండునే దుఃఖములు గండములు ఢీయను చు బైకి రా గలవే మెండుగా మధురమై యుండు మోక్షము నాకు దండ్రితో గడియ సే పుండినను జాలు ||నేది||నడుము పై నొక సంచి బడెకఱ్ఱ చేతిలో నిడికొనుచు శత్రువుల పుడమి వే గడుతున్ నడుదారి కరుకు నె న్నక వేగ రక్షింప బదుదునని పాడి చని పరమసుఖి నౌదు ||నేది|| ✍ పురుషోత్తము చౌధరి Yedhi Naa Visraanthi – Yee Loakamandhu – Ne Dhikku Kanu Gonna - Ledhu Sukha Mendhu = Medhu Raamoadha Ni –Thyoa Dhagra Moaksha Puta – Bhedha Muna Chorakunna - Ledhu Sukha Mechata || Yedhi Naa || Kashtamulu Theratheralu – Ga Vachina Madhatma Dhru Shti Dapaka Yaarchi – Thiramandha Valayn = Spashta Magu Naa Throva – Payanambhu Thudha Muta – Shreshta Magu Naa Illa Cheru Nandhaka || Yedhi Naa || Korindha Podhachuttu – Koniyundu Nimmu Ne – Gora Nichaa Gulaabhi – Kusumashayanambhu= Nerithinaina Naa- Yesu Romuna Jeri – Bhurisukha Mondheda Vi – Chaara Mika Nela || Yedhi Naa || Yesupriya Minche Kea – Neringi Kaangonu Vela – Naa Sanhasamu Nindu – Paasi Chane Vehalu = Bhasuranbhu Ga Manchu- Pagidhi Dhala Halalada Jesi Naa Kanillu – China Ledabaapi || Yedhi Naa || Undune Sandhiyamu – Lundune Dhukhamulu – Gandamu Lu Diyanu Chu Bhaiki Raagalavai = Mendugaa Madhura Mai – Yundu Mokshamu Naaku – Dhandritho Gadiya Se – Pundinanu Jaalu || Yedhi Naa || Nadumu Pai Noka Sanchi–Badekarra Chethilo – Nidikonu Chu Shathruvula – Pudami Vegaduthun = Nadudhaari Karau Ne – Nakka Vega Rakshimpa Badhudhunani Paadi Chain – Paramasuki Naudhu || Yedhi Naa || ✍ Purushotthamu Choudhary akk 1
కామెంట్‌ను పోస్ట్ చేయండి