హోమ్Purushotthamu.C 473 1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట వద్దు మనస బుద్ధి కురుచ పెద్దలకు బెద్ద పరి శుద్ధు డగు క్రీస్తు తా దిద్దు నిను బ్రేమ సరి హద్దులను మీరబో ||వద్దు||చెడ్డ తలపు లడ్డి నిలుపు మెడ్డెలకు నెద్దెయగు గడ్డు సాతాను నకు మెడ్డుకొని దొడ్డ ప్రభు బిడ్డవలె నడువు మిక ||వద్దు||నింద పాలు బొంద మేలు పొందుగను అందముగ ముందు నీ యందు వెలు గొందు ప్రభు సుందర ని బంధనలు మరిచ పో ||వద్దు||ఆశ బెట్టు యేసు తట్టు దోసములు వాసి చన జేసి నను మోసి కొను యేసు నిజ దాసులను బాసి యుండకు మిక ||వద్దు||బెండు పడకు నిండు విడకు దండి గల తండ్రి యొడ యుండు యేసుండు నీ యండ నుండగ నీ గుండె దిగు లేల యిక ||వద్దు||పట్టు విడకు దిటము సెడకు నెట్టుకొని ముట్టడిగ జుట్టుకొను కష్టముల బిట్టు విడగొట్టు ప్రభు తట్టు కనిపెట్టు మిక ||వద్దు||మంచి గుణము లెంచికొనుము వంచనల మించి గ ర్వించి నీ దు ర్భావము ద్రుంచు ప్రభు నొద్ద గురి యుంచి ప్రార్ధించు మిక ||వద్దు|| ✍ పురుషోత్తము చౌధరి Vaddhu Manasa – Budhdhi Kurucha -= Pedhdhalaku Pedhdha Pari – Sudhdhudagu Kreesthu Thaa –Dhidhdhu Nee Prema Sari – Hadhdhulanu Meera Boa || Vaddhu || Cheddar Thalapu – Laddi Nilupu – Meddelaku Nedde Yagu – Gaddu Saathaanunaku – Meddukoni Dhodda Prabhu – Bidda Vale Nadupu Mika || Vaddhu || Nindha Paalu – Bondha Melu = Pondhuganu Andhamuga – Mundhu Nee Yandhu Velu Gondhu Prabhu Sundhara Ni-Bandha Nalu Mariachi Poa || Vaddhu || Aasapettu–Yesu Thattu=Dhoasamulu Vaasi Chana–Jesi Nanu Moasi Konu–Yesu Nija Dhaasulanu–Bhaasi Yundaku Mika || Vaddhu || Bendu Padaku–Nindu Vidaku Dhandi Gala Thandri Yeda– Yun Du Yesundu Nee–Yanda Nundaga Nee–Gunde Dhigulela Yika || Vaddhu || Manchi Gunamu – Lenchi Konumu = Vanchanala Minchi Ga – Rvinchi Nee Dhurbhaavamu – Thrunchu Prabhu Nodhdha Guri Yunchi Praardhinchu Mika || Vaddhu || ✍ Purushotthamu Choudhary akk 1
కామెంట్‌ను పోస్ట్ చేయండి