హోమ్Purushotthamu.C 478 1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట విసుకదే ప్రాణంబు విజ్ఞాని కిలను పొసగు వైరాగ్యంబు పుట్టదే తలను అసదు గానట్టి కష్టానుభవమే గాని యసదృశానంద ఫల మొసగు నది యేది ||విసుకదే||మును పేది యుండెనో వెనుక నదియే యుండు మునుపు వెనుకకు మధ్య మున నున్న దదియే నొనరంగ గ్రొత్తయై యుత్పన్నమగు నట్టి ఘనకార్య మొక్కటియు గానంగరాదు ||విసుకదే||ధరణి మీదికి దిగం బరుబగుచు నేతించు మరణ మప్పుడు దిగం బరుడగుచు బోవున్ నర్రుడు పుట్టినడు సరెకెద్దియును తేడు మరణమగు నాడొక్క సరకుగొనిపోడు ||విసుకదే||ఒక తరము పోవు మరియొక తరము జనుదెంచు సకల వంశము లిట్లు సమసిపోవుచుండు నిక వారి పేర్పింపు లెచ్చోట నేమాయె నొకండైన చెప్పుటకు నుర్విలో లేడు ||విసుకదే||ఏటివంకలు దీర్చ నెవ్వాని కలవి ము న్నీటి మూకుడు సేయ నేర్పరి యెవండు మోటైన మనసు వం పులు దీర్చు గురు వెవడు కోటి ధనమిచ్చినను కుంభినిని లేడు ||విసుకదే||ధరణిలో నరరూపు దాల్చి పాపుల కొఱకు మరణమై లేచు స ద్గురు డైన యేసు చరణాబ్జముల సేవ సారమిది యొక్కటే పరమ ఫలమిడు సుఖ ప్రాప్తి యొనరించున్ ||విసుకదే|| ✍ పురుషోత్తము చౌధరి Visukadhe Praanambhu –Vignani Kilanu – Posagu Vairaa Gya Mbhu –Putade– Thalanu= Asadhu Gaanati Ka– Shtanu Bhava Me Gaani – Yasadrushanandha Phala – Mosagu Nadhi Yedhi || Visukadhe || Munu Pedhi Yundeno-Venuka Nadhiye Yundu – Munupu Venukaku Madhya – Munananu Dhadhiye = Nosaranga Groththai – Yatpanamagu Nati – Ghanakaarya Mokatiyu – Gaanangaraadhu || Visukadhe || Dharani Midhiki Dhigam–Barubaguchu Nethinchu– Mara Na Mapudu Dhigam –Barudaguchu Bovun= Narudu Putti Nandu – Sarekedhiyunu Thedu- Maranamagu – Nadokka – Sarakugonipodu || Visukadhe || Oka Tharamu Povu Mariyoka Tharamu Janudhenchu – Sakala Vamshamu Litllu– Samasipovuchundu=Nika Vaari Prpempu – Lechota Nemayo – Nokandaina Cheputaku Nurvilo Ledu || Visukadhe || Yetivankalu Dhircha – Nevvani Kalavi Mu- Nniti Mooku Du Seya – Nerpari Yevandu = Motaina Manasu Vom – Pulu Dhirchu Guru Vevandu Koti Dhanmichinanu – Khumbhinini Ledu || Visukadhe || Dharanilo Nararupu – Dhaalchi Papula Korraku – Marana Mai Lechu Sa – Dhurgudaina Yesu=Charanambjamula Seva – Saaramidi Yokatai – Parama Phalamidu Sukha – Praapthi Yonarinchun || Visukadhe || ✍ Purushotthamu Choudhary akk 1
కామెంట్‌ను పోస్ట్ చేయండి