హోమ్Purushotthamu.C 485 1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట సకలేంద్రియములారా చాల మీ పని దీరె నిక నన్ను విడిచిపోవు టకు వేళయ్యెన్ చకిత మృగ శాబకము పోలిక నకట మీచే జిక్కి తిని మీ రి క దొలంగుడు యేసు నా ర క్షకుడు వచ్చెను నన్ను గావను ||సకలేంద్రియములారా||పంచేంద్రియములారా బల ముడిగె మీ కిపుడు వంచన సేయ మీ వశముగా దికను మించి మీ రెదిరింపలేరు ద లచి చూడుడు దేవ కృపలో నుంచి నను గదలింప మీకది కొంచెమగు పని కాదు నుండి ||సకలేంద్రియములారా||శ్రవణేంద్రియము నీదు శక్తి తగ్గుచు వచ్చె వివిధవార్తలు దవిలి విను చుంటి వెంతో చెవుడు నీకిపు డనుసరించెను చేవ తణిగెను జరిగి పొమ్మిక సవినయంబుగ యేసు క్రీస్తుని శబ్ద మాలించెదను సుఖ మది ||సకలేంద్రియములారా||కనులారా మీ వెల్గు క్రమముగ క్షీణించె మును జూచు చూడ్కిలో ముసు కయ్యె నికను ఘనముగల దేవుని కుమారుడు తన కృపాసన మిపుడు జూపను మనసులోపలి కన్ను విప్పెడి దినము లివె చనుదెంచె జూడుడు ||సకలేంద్రియములారా||రసనేంద్రియము నీ నీ రసకాల మిదె వచ్చె విసుకని మాటలనువెదజల్లి నావు పస దరిగి ముది వైతి విపు డో రసనమా యిక దీరె నీ పని వెసను నే నిపు డేసుకరుణా రసము గ్రోలుచు బ్రొద్దు బుచ్చెద ||సకలేంద్రియములారా||తను వాద్యంతము మూయ దగిన త్వగింద్రియమా నిను సోకునట్టి వ న్నియు గ్రహించితివి మునుపుగల నీ జిగిబిగియు నణం గెను గదా వ్రేలాడె దిత్తులు చనుము నీ వెందైన నేనే సుని స్వరూపము దాల్ప బోయెద ||సకలేంద్రియములారా||ఘ్రాణేంద్రియమ నీవు కడు వాసనల దగిలి ప్రాణానిలము చేత బ్రబలితి వికను నాణెమైనవి విడును దుర్గం ధముల బాల్పడ బోదు విక నా త్రాణపతి యగు క్రీస్తుచేతను బ్రాణ మర్పింతును సుఖింతును ||సకలేంద్రియములారా||కడు దవ్వు పయనంబు నడిచి వచ్చితి నింక నిడుపు లే దా త్రోవ నికటమై వచ్చెన్ నడుమ నడుమ నడ్డుపడియెడ నిడుమ లన్నియు గడిచిపోయెను జడుతు నా మృతి నదికి నా నా వికుడు వచ్చెను నన్ను గావను ||సకలేంద్రియములారా||వెనుక దీరిన మార్గ మున కంటె ముందుండి కనుపించు నా త్రోవ కఠినమైన యుండు ఘన తరంగ ధ్వనుతో భీ కర మరణ నది పాఱు చున్నది క్షణము మాత్రమె దాని పని యా వెనుక నావలి యొడ్డు జేరెద ||సకలేంద్రియములారా||ఈ సంపారంబునం దేమి సౌఖ్యము గలదు ఆశ మాత్రమె గాని యది చిరము గాదు యేసు క్రీస్తుడు తండ్రి దేవుడు భాసురం బగు నిర్మలాత్మయు దాసులకు దమ దివ్య మగు కృప జేసి నిత్య నివాస మిత్తురు ||సకలేంద్రియములారా|| ✍ పురుషోత్తము చౌధరి Sakalendhriyamu Laaraa – Chaala Mee Pani Theere – Nika Nannu Vidichi Poavu Taku Vela Yyen = Chaktha Mruga Saabakamu Poalika – Nakata Mee Che Jikkithini Mee- Ri Ka Tholan Gudu Yesu Naa Ra –Kshakudu Vachchenu Nannu Gaavanu || Sakalendhriyamu || Panchendhriyamu Laaraa – Bala Mudige Mee Kipudu- Vanchana Seya Mee – Vasamu Gaa Dhikanu Minchi Mee Redhi Rimpa Leru Dha- Lachi Chuududu Dheva Krupaloa – Nunchi Nanu Gadha Limpa Mee Kadhi Konchemagu Pani Kaadhu Sundi || Sakalendhriyamu || Sravanendhriyamu Needhu –Sakthi Thagguchu Vachche –Vi Vidha Vaarthalu Dhavili Vinu Chunti Venthoa = Chevudu Nee Kipudanusarinchenu – Cheva Thanigenu Jarigi Pommika – Sa Inayambuga Yesu Kreesthuni –Sabdha Maalinchedhanu Sukamadhi || Sakalendhriyamu || Kanulaaraa Mee Velugu – Kramamuga Ksheeninche – Munu Juuchu Chuudkiloa – Musuk Ayye Nikanu = Ghanamugala Dhevuni Kumaarudu – Thana Krupaasana Mipudu Juupanu – Manasu Loapali Kannu Vippedi Dhinamulive Chanudhenche Chuududu || Sakalendhriyamu || Rasanendhriyamu Nee Nee – Rasakaala Midhe Vachche – Visukani Maatalanu Vedha Jalli Naavu = Pasa Tharigi Mudhi Vaithi Vipudoa – Rasanamaa Yika Theere Nee Pani – Vesanu Ne Nipu Desu Karunaa–Rasamu Groaluchu Prodhdhu Puchchedha || Sakalendhriyamu || Eee Samsaarambunan–Dhemi Sowkhyamu Kaladhu Aasa Maathrame Gaani Adhi Chiramu Gaadhu = Yesu Kreesthudu Thandri Dhevudu – Bhaasurambagu Nirmalaathmayu – Dhaasu Laku Thama Dhivya Magu Krupa–Chesi Nithya Nivaasa Mithuru || Sakalendhriyamu || ✍ Purushotthamu Choudhary akk 1
కామెంట్‌ను పోస్ట్ చేయండి