Sthothrinchi keerthinthumu halleluya స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయ స్తుతి చెల్లించి

Song no: 202

    స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయ
    స్తుతి - చెల్లించి యుల్లసింతము హల్లెలూయ } 2

    అనుపల్లవి : గడచిన కాలమెల్ల - కంటిపాపవలె } 2
    కాచెను ప్రభువు మమ్ము హల్లెలూయ - ప్రభున్ } 2|| స్తోత్రించి ||

  1. పాపమును బాపినాడు హల్లెలూయ - మన
    శాపమును మాపినాడు హల్లెలూయ } 2
    కన్నతల్లివలెనె - కనికరించెను మమ్ము } 2
    యెన్నతరమా ప్రేమ హల్లెలూయ - ప్రభున్ || స్తోత్రించి ||

  2. తల్లియైన మరచినను హల్లెలూయ - తాను
    ఎన్నడైన మరచిపోడు హల్లెలూయ } 2
    ఎల్ల యీవుల నిచ్చి యుల్లాస మొసగును } 2
    కొల్లగ మనల కోరి హల్లెలూయ - ప్రభున్ || స్తోత్రించి ||

  3. శోధన కాలములందు హల్లెలూయ - మన
    వేదన కాలములందు హల్లెలూయ } 2
    నాథుడు యేసు మన చెంతనుండ నిల } 2
    చింత లేమియు రావు హల్లెలూయ - ప్రభున్ || స్తోత్రించి ||

  4. ఘోర తుఫాను లెన్నెన్నో హల్లెలూయ - బహు
    ఘోరముగ లేచినను హల్లెలూయ } 2
    దోనెయందున్న యేసు - దివ్యముగను లేచి } 2
    ధాటిగా వాటి నణచు హల్లెలూయ ప్రభున్ || స్తోత్రించి ||

  5. సర్వలోకమునందున హల్లెలూయ - నన్ను
    సాక్షిగ నుంచెను యేసు హల్లెలూయ } 2
    చేరిన వారినెల్ల కోరి ప్రేమించు నేసు } 2
    చేర్చును కౌగిటిలో హల్లెలూయ ప్రభున్ || స్తోత్రించి ||
Copyright © Lyrics List. Designed by OddThemes