జీవం నా ప్రాణం నీవే యేసయ్యా జీవం నా సర్వం

    జీవం నా ప్రాణం నీవే యేసయ్యా
    జీవం నా సర్వం నీవే యేసయ్యా
    నా కున్న సర్వం నీదే
    నాలోన ప్రాణం నీదే

    అలలేన్ని నాపై ఎగిసివచ్చినా
    అంధకారమే దారిమూసినా
    అండనీవై నా కుండగా
    భయముండునా
    నాకు దిగులుండునా

    శోధనలు నన్ను చుట్టుముట్టినా
    శత్రువు నాపై చెలరేగి వచ్చినా
    ఆశ్రయముగ నీవుండగా
    భయముండునా
    నాకు దిగులుండునా