హోమ్Purushotthamu.C 315 1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట ఉన్నపాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో రక్షకా యెన్న శక్యముగాని పాపము లన్ని మోపుగ వీపుపైబడి యున్న విదె నడలేక తొట్రిలు చున్నవాడను నన్ను దయగను ||ఉన్న||కారుణ్యనిధి యేసు నా రక్షకా నీ శ రీర రక్తము చిందుట భూరి దయతో నన్ను నీదరి జేర రమ్మని పిలుచుటయు ని ష్కారణపు నీ ప్రేమ యిది మరి వేరే హేతువు లేదు నా యెడ ||ఉన్న||మసి బొగ్గువలె నా మా నస మెల్ల గప్పె దో ష సమూహములు మచ్చలై అసిత మగు ప్రతి డాగు తుడువను గసుటు గడిగి పవిత్ర్ర పరపను నసువు లిడు నీ రక్తమే యని మసల కిప్పుడు సిలువ నిదె గని ||ఉన్న||వెలపట బహు యుద్ధ ములు లోపటను భయము కలిగె నెమ్మది దొల గెను పలు విధములగు సందియంబుల వలన బోరాటములచే నే నలసి యిటునటు గొట్టబడి దు ర్భలుడనై గాయములతో నిదె ||ఉన్న||కడు బీదవాడ నం ధుడను దౌర్భాగ్యుడను జెడిపోయి పడి యున్నాను సుడివడిన నా మదికి స్వస్థత జెడిన కనులకు దృష్టి భాగ్యము బడయవలసిన వన్ని నీ చే బడయుటకు నా యెడ యడా యిదె ||ఉన్న||నీ వాగ్దత్తము నమ్మి నీపై భారము పెట్టి జీవ మార్గము గంటిని కేవలంబగు ప్రేమ చేతను నీవు నన్ను క్షమించి చేకొని భావశుద్ధి నొనర్చి సంతోషావసరముల నిడుదువని యిదె ||ఉన్న||దరిలేని యానంద కరమైన నీ ప్రేమ తరమే వర్ణన చేయను తెరవు కడ్డం బైన యన్నిటి విఱుగగొట్టెను గాన నే నిపు డరుదుగా నీ వాడ నవుటకు మఱి నీవాడ నవుటకే ||ఉన్న|| ✍ పురుషోత్తము చౌధరి Unna Paatuna Vacchu – Chunnaanu Nee Paadha Sannidhi Koa Rakshakaa= Enna Sakyamu Kaani Paapamu – Lanni Moapuga Veepupai Padi –Yunna Vidhe Nadaleka Thotrilu –Chunna Vaadanu Nannu Dhayaganu || Unna Patuna || Kaarunya Nidhi Yesu – Naa Rakshakaa Nee Sa-Reera Rakthamu Chindhuta- Bhuuri Dhayathoa Nannu Nee Dhari- Chera Rammani Piluchutayu Ni-Shkaaranapu Nee Prema Eidhi Mari – Vere Hethuvu Ledhu Naa Eda || Unna Patuna || Masi Boggu Vale Naa Maa-Nasa Mella Gappe Dhoa-Sha Samuuhamulu Macchalai = Asitha Magu Prathi Dhaagu Thuduvanu – Gasutu Kadigi Pavithra Parapanu – Asuvu Lidu Nee Raktame Yani –Masala Kippudu Siluva Nidhe Gain || Unna Patuna || Velapata Bahu Yuddha –Mulu Loapatanu Bhayamu – Kalige Nemmadhi Tholagenu =Palu Vidhamulagu Sandhiyambula- Valana Poaraatamulache Nen-Alasi Eitunatu Kottabadi Dhu-Rbhaludanai Gaayamulathoa Nidhe || Unna Patuna || Kadu Beedha Vaada Nan-Dhudanu Dourbhaagudanu – Chedipoayi Padi Yunnaanu = Sudi Vadina Naa Madhiki Svasthatha – Chedina Kanulaku Drushti Bhaagyamu – Badaya Valasina Vanni Nee Che –Bada-Yutaku Naa Yoda Yadaa Eidhe || Unna Patuna || Nee Vaagdhatthamu Nammi - Nee Pai Bhaaramu Petti – Jeeva Maargamu Gantini Kevalambagu Prema Chethanu – Neevu Nannu Kshaminchi Chekoni Bhaava Suddhi Nonarchi Santhoasaavasaramula Nidudhu Vani Eidhe || Unna Patuna || Dharileni Aanandha Karamaina Nee Prema- Tharame Varnana Cheyanu = Theravu Kaddambaina Yanniti – Viruga Gottenu Gaana Ne Nipu Darudhugaa Nee Vaada Navutaku – Mari Nijamu Nee Vaada Navutake || Unna Patuna || ✍ Purushotthamu Choudhary akk 1
కామెంట్‌ను పోస్ట్ చేయండి