హోమ్Purushotthamu.C 299 1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట యేసు నాథ కథా సుధా రస మిదిగో పానము జేయరే దోసకారి జనంబులారా దురిత భవముల బాయరే ||యేసు||ఇహపరంబు లెవనిచే సృజి యింపబడియెనొ చూడరే అసహహ యా విభు డవతరించెను అతని గుణముల బాడరే ||యేసు||దురిత భరితుల దుష్ట చరితుల నరయ వచ్చెను జూడరే స్థిరముగామది నమ్మి యా ప్రభు కరుణ మది గొనియాడరే ||యేసు||పనికిమాలిన వేలుపుల దెస పరుగు లెత్తుట మానరే తనువు మీ కొఱ కిచ్చు క్రీస్తుని దయకు బాత్రత బూనరే ||యేసు||మరణ బలి రక్తమున మన యం దఱిని బ్రోవను వచ్చెను కరుణతో బాపుల బిలుచు గురు దరికిబోవుద మిచ్ఛను ||యేసు||పరమతత్వ విధాన బోధలు బాగుగ బ్రకటించెను చిరసుఖాస్పద పదము గోరిన జీవులకు వినిపించెను ||యేసు||మరణ మొందిన కొందఱికి దా మరల బ్రాణము లిచ్చెను వర మహాద్భుత కార్యముల ని ద్ధర ననేక మొనర్చెను ||యేసు||కుటిల బుద్ధుల ద్రోచి సజ్జన గోష్టి నుండుట గోరరే దిటముగను నెమ్మదిని మీరొం దుటకు క్రీస్తుని జేరరే ||యేసు|| ✍ పురుషోత్తము చౌధరి Yesu Naadha Kathaa Sudhaa Rasa – Midhigpoa Paanamu Jeyare = Dhoasakaari Janambu Laaraa – Dhurith Bhavamula Baayare || Yesu || Eiha Parambu Levaniche Sruji –Yimpa Badiyeno Chuudare = Asahaha Yaa Vibhu Davatharinchenu – Atani Gunamula Baadare || Yesu || Dhuritha Bharithula Dhushta Charithula – Naraya Vachchenu Chuudare = Sthiramugaa Madhi Nammi Yaa Prabhu – Karuna Madhi Koni Yaadare || Yesu || Paniki Maalina Velupula Dhesa – Parugu Leththuta Maanare = Thanuvu Mee Kora Kichchu Kreesthuni – Dhayaku Paathratha Buunare || Yesu || Marana Bali Rakthamuna Mana Andharini Broavanu Vachch Enu = Karunathoa Paapulula Piluchu Guru – Dhariki Poavudha Michchanu || Yesu || Parama Thathva Vidhaana Boadhalu Baaguga Prakatinchenu = Chira Sukhaaspadha Padhamu Goarina – Jeevulaku Vini Pinchenu || Yesu || Maranamondhina Kondhariki Thaa – Marala Praanamu Lichchenu = Vara Mahaadhbhutha Kaaryamula Ni Dhdhara Naneka Monarchenu || Yesu || Kutila Budhdhula Dhroachi Sajjana – Goasti Nunduta Goarare = Dhitamu Ganu Nemmadhini Mee Ron –Dhutaku Kreesthuni Jearare || Yesu || ✍ Purushotthamu Choudhary akk 1
కామెంట్‌ను పోస్ట్ చేయండి