హోమ్Purushotthamu.C 301 1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట రారో జనులారా వేగము గూడి రారో ప్రియులారా శాశ్వతమైన ఘన రక్షణ జేర సారాసారముల్ సమ్మతిగా జూచి ధీరత్వమున క్రీస్తు జేరు దారి గోరి ||రారో||అనుమానము లన్ని మీరలు మాని ఆద్యంతము లేని కనికరము చేత మనల రక్షింపను దన జీవము నిచ్చు ఘనుని క్రీస్తుని గొల్వ ||రారో||మన పాపము లన్ని మోయను దే వుని చే బని బూని మనుజావ తారుడై వినుట కద్భుతమైన పను లెన్నో చేసి సి ల్వను బడిన ఘను జేర ||రారో||పాపాత్ము లగు వారి భారము ద్రుంచు బలుడైన యుపకారి ఓపికతో దన దాపు జేరిన వారి శాపము తా మోసి కాపాడు ఘనువే(డ ||రారో||తన యాత్మకు గీడు గల్గించెడు ఘనత లెల్లను పాడు తనువు నిత్యము గా దని యభిమాన మును వీడి మన క్రీ స్తుని జడ గతిజూడ ||రారో||సకలాంతర్యామి నిరాకారు డొకడే యంతట సామి ప్రకట ముగా మర్త్యు లకునెల్ల మధ్యస్థు డొకడే క్రీస్తుడు సం రక్షకుడై యిలుకు వచ్చె ||రారో|| ✍ పురుషోత్తము చౌధరి Raaro Janulaaraa – Vegamu Guudi –Raaroa Pryulaara –Saasvathamaina – Ghana Rakshana Jera = Saaraa Saaramul = Sammathi Gaa Juuchi – Dheerathvamuna Kreesthu- Jeru Dhaari Goari || Raaro || Anu Maanamu Lanni – Meeralu Maani – Aadhyanthamu Leni = Kanikaramu Chetha – Manila Rakshimpanu – Thana Jeevamu Nichchu – Ghanunu Kreesthuni Golva || Raaro || Mana Paapamu Lanni Maoayanu Dhe- Vuniche Bani Buuni -= Manu Java Thaarudai – Vinuta Kadhbuthamaina – Panu Lennoa Chesi Si –Lvanu Padina Ghanu Jera || Raaro || Paapaathmulagu Vaari Bhaaramu Dhrunchu – Baludaina Upakaari = Oapikathoa Thana – Dhaapu Jerina Vaari – Saapamu Thaa Moasi – Kaapaadu Ghanu Veda || Raaro || Thana Yaathma Ku Geedu – Galginchedu – Ghanatha Lellanu Paadu = Thanuvu Nithya Mugaa – Dhani Abhimaana – Munu Veedi Mana Kree –Sthuni Jada Gathi Juuda || Raaro || Sakalaanthryaami – Niraakaaru – Dokade Anthata Saami = Prakatamugaa Marthyu – Laku Nella Madhyasthu – Dokade Kreesthudu Sam – Rakshakudai Yilaku Vachche || Raaro || ✍ Purushotthamu Choudhary akk 1
కామెంట్‌ను పోస్ట్ చేయండి