హోమ్Purushotthamu.C 313 1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట త్రాహి మాం క్రీస్తు నాధ దయ జూడ రావే నేను దేహి యనుచు నీ పాదములే దిక్కుగా జేరితి నిపుడు ||త్రాహి||గవ్వ చేయురాని చెడ్డ కర్మేంద్రియాధీనుడనై రవ్వ పాలై నే నెంతో నెవ్వ బొందితి త్రవ్వుచున్న కొలది పెరుగు దరగదు నా పాప రాశి యివ్విధమున జెడిపోతినినే నేమి సేతు నోహోహోహో ||త్రాహి||నీ యందు భయభక్తులు లేని నిర్లజ్జాచిత్తము బూని చేయరాని దుష్కర్మములు చేసినాడను దయ్యాలరాజు చేతిలో జేయి వేసి వాని పనుల జేయ సాగి నే నిబ్భంగి జెడిపోయితి నే నయ్యయ్యయ్యొ ||త్రాహి||నిబ్బర మొక్కించుకై నిజము రవ్వంతైన లేక దబ్బర లాడుటకు ము త్తా నైతిని అబ్బురమైన ఘోర పా పాంధకార కూపమందు దబ్బున బడిపోతి నయ్యో దారి చెడి నేనబ్బబ్బబ్బా ||త్రాహి||నిన్ను జేరి సాటిలేని నిత్యానంద మందబోవు చున్నప్పుడు నిందలు నా కెన్ని చేరినా విన్నదనము లేకుండ నీ వే నా మదికి ధైర్యమిచ్చి యన్నిట రక్షించి తివి నా యన్న నీకు స్తోత్ర మహాహా ||త్రాహి|| ✍ పురుషోత్తము చౌధరి Thraahi Mam Kreesthu Naadha- Dhaya Juuda Raave = Nenu Dhehi Anuchu Nee Paadhamule – Dhikkugaa Cherith Nipudu || Thraahi Mam || Gavva Cheya Raani Chedda – Karmendriyaadheenu Danai – Ravva Paalai Nenenthoa – Nevva Pondhithi – Travvu Chunna Koladhi – Perugu- Taragadhu Naa Paapa Raasi – Eivvidhamuna Chedipoathini Ne- Nemi Sethu Noa Hoa Hoa Hoa || Thraahi Mam || Nee Yandhu Bhaya Bhakthulu Leni- Nirlajjaa Chitta Mu Buuni – Cheya Raani Dhushkarmamulu –Chesi Naadanu = Dhayyaala Raaju Chethiloa –Cheyi Vesi Vaani Panula –Cheya Saagi Ne Nibbhangi Chedi Poayithi Ne Nayyayyayyoa || Thraahi Mam || Nibbara Mokkinchukaina –Nijamu Ravvanthainaa Leka – Dhabbara Laadutaku Muttaanaithini = Abbura Maina Ghoara Paa- Paandha Kaara Kuupa Mandhu Dhabbuna Padi Poathi Nayyoa – Dhaari Chedi Ne Nabbabbabbaa || Thraahi Mam || Ninnu Cheri Saati Leni- Nithyaanandha Mandha Boavu –Chunnappudu Nindalu Naakenni Cherinaa = Vinna Dhanamu Lekundaa Nee- Ve Naa Madhiki Dhairya Micchi- Annita Rakshinchithivi Naa Anna Neeku Sthoathra Mahahahaa || Thraahi Mam || ✍ Purushotthamu Choudhary akk 1
కామెంట్‌ను పోస్ట్ చేయండి