హోమ్Purushotthamu.C 319 1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట ఎఱింగి యెఱిగి చెడిపోతివి మనసా యిక నీ దిక్కెవ్వరు చెపుమా దురితం బిది స చ్ఛరితం బిది యని యెరుక సరకు గొన కేమియు నీ ||యెఱిగి||ఇది దేవుని దయ యిది క్రీస్తుని ప్రియ మిది విమలాత్ముని గుణ మనుచు ఎదలో ననుభవ మెఱింగి మరల దు ర్మదమున దుష్కృత పదమున బడితివి ||యెఱిగి||సకలము జూచెడు దేవుని కంటికి జాటుగ జరిగెడి పని యేది ఇక జెవి గుసగుస లెల్లను దిక్కుల బ్రకటము జేసెడు ప్రభు వున్నాడని ||యెఱిగి||ఎన్నిమార్లు సిలువను వేయుచు ప్రభు యేసుని వెతబడ జేసెదవు తిన్నని మార్గము తెలిసియుండి నీ కన్నుల గంతలు గట్టితి వయ్యో ||యెఱిగి||గద్దించెడు మనస్సాక్షికి గడ లాడక పోతివి నీవు హద్దుమీరి దై వాజ్ఞలు ద్రోయుచు నెద్దు లాగు పరు గెత్తితి వయ్యో ||యెఱిగి||పలువిధ శోధన బాధలలో ఘన ప్రభు క్రీస్తుడై నీ దిక్కునుకో తాళుచు బశ్చాత్తాపముపడి యిక జాలించుము కలు షపు యత్నంబు ||యెఱిగి||అపరిమిత దయా శాంతులు గల ప్రభు వనిశము కోపింపడు నీపై కృపా వాగ్దద్తము లెపుడు దలచి నీ యపవిత్రత గని హా యని యేడ్వుము ||యెఱిగి|| ✍ పురుషోత్తము చౌధరి Yerigi Yerigi Chedi Poathivi Manasaa – Yika Nee Dhikkevvaru Chepumaa = Dhurithambidhi Sa – Chcharitham Bidhi Yani – Yeruka Saraku Gona– Kemiyu Nee || Yerigi || Eidhi Dhevuni Dhaya Eidhi Kreesthuni Priya – Midhi Vimalaathmuni Guna Manuchu = Eadhaloa Nanu Bhava – Merigi Marala Dhu – Rmadhamuna Dhushkrutha – Padhamuna Badithivi || Yerigi || Sakalamu Chuuchedu Dhevuni Kantiki – Chaatuga Jarigedu Pani Yedhi = Eika Chevu Gusagusa – Lellanu Dhikkula Parka Tamu Jesedu – Prabhuvunnaadani || Yerigi || Eanni Maarlu Siluvanu Veyuchu Prabhu – Yesuni Vetha Bada Chesedhavu = Thinnani Maargamu – Thelisiyundi Nee – Kannula Ganthalu – Gattithi Vayyoa || Yerigi || Gadhdhinchedu Mana Saakshiki Gada - Gada Laadaka Poathivi Neevu = Hadhdhu Meeri Dhai – Vaajnalu Droyuchu – Nedhdhu Laagu Paru – Geththithi Vayyoa || Yerigi || Palu Vidha Soadhana Baadhalaloa Ghana – Prabhu Kreesthu De Nee Dhikkanuchoa Thaalu Chu Paschaaththaapamu Padi Eika – Chaalinchumu Kalu –Shapu Yathnambu || Yerigi || Aparimitha Dhayaa Saanthulu Gala Prabhu – Vanisamu Koapimpadu Neepai=Krupaa Vaa Gdhaththamu Lepudu Thalachi Nee Yapa Vithratha Gani Haa Yani Yedvumu || Yerigi || ✍ Purushotthamu Choudhary akk 1
కామెంట్‌ను పోస్ట్ చేయండి