హోమ్Purushotthamu.C 228 1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట నాడు వచ్చినట్లు గాదు నేడు వచ్చుట తేరి చూడరాదు క్రీస్తు నింక జొత్తు మెచ్చుట ||నాడు||మొదట గొఱ్ఱెపిల్ల రీతి నొదిగి వచ్చెగా యిపుడు కొదమ సింహమయ్యె మనకు గుండె దిగులుగా ||నాడు||దాసునివలె దొల్లి జూచినాముగా యిపుడు దోసము లెంచి దండింప దొరయైనాడుగా ||నాడు||ఏ తట్టు బోయిన మనకు నెదురు వచ్చెగా పిడుగు రీతి వాని యుగ్రమైన దృష్టి హెచ్చగా ||నాడు||కొండ వండ లందు డాగి యుండలేముగా వాని యండనుండి మండు నగ్ని యదిగో వచ్చెగా ||నాడు||దిక్కుగా నున్నట్లు నితర దేవతలను నమ్మి వట్టి పుక్కిటి పురాణములకు బోయి చెడితిమి ||నాడు||వీధుల బోధించు వారి వినక పోతిమి యిపుడు బాధ బొంది నరకాగ్నిలో బడబాలైతిమి ||నాడు|| ✍ పురుషోత్తము చౌధరి Naadu Vachchi Natlu Gaadhu – Nedu Vachchuta = Theri – Chuudaraadhu Kreesthu Ninka – Joththu Mechchata || Naadu || Modhat Gorrepilla Reethi – Nodhigi Vachchegaa= Yipudu Kodhama Simhamayye Manaku – Gunde Dhigulugaa || Naadu || Dhaasuni Vale Tholli – Chuuchi Naamugaa = Yipudu Dhoasamu Lenchi Dhandimpa – Dhorayai Naadugaa || Naadu || Ye Thattu Boyina Manaku – Nedhuru Vachchegaa = Pidugu – Reethi Vaani Yugramaina Dhrushti Hechchagaa || Naadu || Konda Vandal Landhu Dhaagi – Yunda Lemugaa= Vaani – Anda Nundi Mandu Agni – Adhigoa Vachchegaa || Naadu || Dhikkugaa Nunnatlu Nithara – Dhevathalanu Nammi = Vatti – Pukkiti Puraanamulaku Poayi Chedithimi || Naadu || Veedhula Bhoadhinchu Vaari Vinaka Poathimi = Yipudu Baadha Nondhi Narakaagniloa Pada Paalaithimi || Naadu || ✍ Purushotthamu Choudhary akk 1
కామెంట్‌ను పోస్ట్ చేయండి