హోమ్Purushotthamu.C 252 1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట దేవు డిచ్చిన దివ్యవాక్య మి దేను మన కో యన్నలారా భావ శుద్ధిని జేయు ఘన శుభ వర్తమానము దీని పేరు ||దేవు డిచ్చిన||భయముతో భక్తితో జదివిన ప్రాపు క్రీస్తు డటంచు దెల్పును దయా మయుడగు దేవుడే మన తండ్రి యని బోధించు నెల్లెడ ||దేవు డిచ్చిన||సత్యశాంతము లంకురించును సత్క్రియా ఫలములును బొడమును నిత్యజీవము గలుగు దానన్ నిస్సందేహముగ నుండును ||దేవు డిచ్చిన||ఈ సుమంగళ దివ్యవాక్యము నిప్పుడే మీ రనుసరించుడు దోసములు నెడబాసి మోక్షపు ద్రోవ గోరిన వారలెల్లరు ||దేవు డిచ్చిన||పాపములలో నుండి విడుదల పరమ సుఖ మని దలతు రేనియు తాప మార్పును లేచి రండి త్వరగ క్రీస్తుని శరణు బొందను ||దేవు డిచ్చిన||దురిత ఋణములు దీర్చు మధ్య స్థుండు గావలె నన్న వారలు త్వరగ రండీ త్వరగ రండీ వరదుడౌ క్రీస్తు కడ కిపుడె ||దేవు డిచ్చిన||మరణమునకై భయము నొందెడి మానసము గల వార లెల్లరు పరమ శాంతి యొసంగు క్రీస్తుని పజ్జ డాయగ రండి వేగము ||దేవు డిచ్చిన||నిర్మలాంతఃకరణ సౌఖ్యము నిజముగా నిలవెదకువారు ధర్మచిత్తుండైన క్రీస్తుని దరికి రండి రండి వేగము ||దేవు డిచ్చిన||మోక్ష రాజ్యము జేర గోరెడు బుద్ధి గలిగిన వార లెల్లరు రక్ష కుండగు యేసు నొద్దకు రండి రండి విశ్వసించుచు ||దేవు డిచ్చిన|| ✍ పురుషోత్తము చౌధరి Devudicchina Dhivya Vaakhya Mi- Dhenu Manakoa Yannalaaraa = Bhaava Sudhdhini Jeyu Hana Subha – Vartha Maanamu Dheeni Peru Dhevudichchina || Devudicchina || Bhayamuthoa Bhakthithoa Chadhivina – Paapu Kreesthu Datanchu Thelpunu = Dhayaa Mayudagu Dhevude Mana – Thandri Yani Boadhnchu Nellada Dhevudichchina || Devudicchina || Sathya Saanthamu Lankurinchunu – Sathkriyaaphalamulanu Bodamunu = Nithy Jeevamu Kalugu Dhaanan – Nissandhehamu Ga Nundunu Dhevudichchina || Devudicchina || Eee Sumangala Dhivya Vaakhyamu – Nippude Mee Ranusa Rinchudu = Dhoasamulu Nedabaasi Moakshapu – Dhroava Goarina Vaara Lellaru Dhevudichchina || Devudicchina || Paapamula Loa Nundi Vidudhala – Parama Sukhamani Thalathu Reniyu = Thaapa Maarpunu Lepi Randi – Thvaraga Kreesthuni Saranu Pondhanu Dhevudichchina || Devudicchina || Dhuritha Runamulu Theerchu Madhya –Sthundu Gaavale Nanna Vaaralu = Thvaraga Randee Thvaraga Randee Varadhudow Kreeshu Kada Kipude Dhevudichchina || Devudicchina || Maranamunakai Bhayamu Nondhedi – Maanasamu Gala Vaara Lellaru = Parama Saanthi Yosagu Kreesthuni – Pajna Daayaga Randi Vegamu Dhevudichchina || Devudicchina || Nirmalaanthakkarana Sowkhyamu– Nijamugaa Nila Vedhaku Vaaru = Dharmachiththundaina Kreesthuni – Dhariki Randi Randi Vegamu Dhevudichchina || Devudicchina || Moaksha Raajyamu Chera Goaredu – Budhdhi Kaligina Vaara Lellaru = Raksha Kundaguyesu Nodhdhaku – Randi Randi Visvasinchuchu Dhevudichchina || Devudicchina || ✍ Purushotthamu Choudhary akk 1
కామెంట్‌ను పోస్ట్ చేయండి