హోమ్Purushotthamu.C 231 1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట ఓహోహో మా యన్నలారా యుద్యోగింపండి యిపుడే త్రాహి త్రాహి యనుచు క్రీస్తుని దయను గోరండి ||ఓహో||అంత్యదినము నాటి బాధ లాలకించండి నరక ప్రాంతమునకు బోకమునుపే ప్రభువును వేడండి ||ఓహో||మింట ప్రభువు తేజోమయమౌ మేఘారూఢుండై యగ్ని మంట వీను సింహాసనము నంటి కూర్చుండు ||ఓహో||అంధకారమగును సూర్యుడా దినమందు కుముద బాంధవుడు మిగుల రక్త వర్ణము నొందును ||ఓహో||కడు భీతిగ సర్వసృష్టి కంపించుచు నుండున్ భూమి కడలి యభ్రము తాపమున కరిగి పోవుచుండున్ ||ఓహో||నరక ప్రచండాగ్ని గుండ మరదై గన్పడును దాని జొరక మరి యే తెరువు పాపా త్ములకు గలుగును ||ఓహో||ప్రేమతో నడిగెదను నా ప్రియబంధువులార మీర లామహా దినమందున దిరమై యట నిలువంగలర ||ఓహో||కామక్రోధ లోభమోహ గర్వగుణములను మీరు ప్రేమించి చేసితిరి గద పెక్కు విధములను ||ఓహో||కల్లలాడుచుడి ప్రొద్దు గడుపుచుంటిరే యింక చిల్లర వేల్పుల పూజ చేయుచుంటిరే ||ఓహో||ప్రకటంబుగ నైన మరి గు ప్తస్థల మందైన చేయు సకల క్రియలు ప్రభువున కెఱుక సంపూర్ణముగాను ||ఓహో||జాతి గోత్రమడుగ బోడు సర్వేశ్వరుండు క్రియల రీతి మనసు మాత్రమె విచా రించు ప్రభువతడు ||ఓహో|| ✍ పురుషోత్తము చౌధరి Oahoho Maa Yannalaaraa – Yudhyoagimpandi = Yipude Thraahi Thraahi Yanuchu Kreesthuni – Dhayanu Goarandi Oahoahoa Maa Yannalaaraa1. Anthya Dhinamu Naati Baadha – Laalakinchandi = Naraka – Praanthamunaku Poaka Munupe – Prabhuvunu Vedandi || Oahoho || Minta Prabhuvu Thejoa Mayamow – Meghaa Ruudundai = Agni – Manta Veenu Simhaasanamu – Nanti Kuurchundu || Oahoho || Andha Kaaramagunu Suuryu Daa Dhinamu Nandhu = Kumudha Baandhavudu Migula Raktha – Varnamu Nondhunu || Oahoho || Kadu Bheethiga Sarva Srushti - Kampinchuchu Nundun = Bhuumi Kadali Abhramu Thaapamuna – Karigipoavu Chundun || Oahoho || Naraka Prachndaagni Gunda – Maradhai Kanpadunu= Dhaani Joraka Mari Ye Theruvu Paapaa –Thmulaku Kalugunu || Oahoho || Premathoa Nadigedhanu Naa – Priya Bandhuvu Laaraa = Meera – Laa Mahaa Dhinamandhu Dhiramai –Ata Niluvangalara || Oahoho || Kaama Kroadha Loabha Moaha – Garva Gunamulanu = Meeru Preminchi Chesithiri Gadha – Pekku Vidhamulanu || Oahoho || Jaathi Goathra Maduga Boadu – Sarvesvarundu = Kriyala –Reethi Manasu Maathrame Vichaa – Richu Prabhuvathadu || Oahoho || ✍ Purushotthamu Choudhary akk 1
కామెంట్‌ను పోస్ట్ చేయండి