హోమ్Purushotthamu.C 271 1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట వినరే నరులారా మనముల వేడుకలను మీర మన, రక్షకుడగు మరియా తనయుని మహిమలు చెవులార ||వినరే||తన కన్నను ముందు యోహా నను నత డింపొందు ఘనతర మగును ప్రవచనముబ ల్కెను భూజను లందు ||వినరే||అతడు యోర్దాను నదిలో ఖ్యాతిగ ననుదినమున్ పాతకులకు బా ప్తిస్మ మిచ్చు నెడం ప్రభు వచ్చటి కరిగెన్ ||వినరే||న్యాయము నిలుపుటకై ప్రభుని వి ధేయత గనుపఱచి శ్రేయ పతి బొం దెను యోహానుని చేత బాప్తిస్మంబు ||వినరే||పరమండల మపుడు తెరవం బడి పావురము గతిన్ పరిశుద్ధాత్మ శు భప్రభ లీనుచు ప్రభువు మీద వ్రాలెన్ ||వినరే||ఆకాశమునుండి కలిగెను ప్రాకటమగు రవము నా కితడు ప్రియం బౌ కుమారుడా నంద మొంది రనుచు ||వినరే||అంతట మన కర్త పరిశుద్ధాత్మ బలము కలిమిన్ సంతసమున మో క్ష కుశలవార్తను జాటంగను దొడగెన్ ||వినరే||ఆ నిత్య సువార్త మన మెద లో నిడి నమ్మినచో నానందమయం బమృత మేసు ద యా నిధి మన కొసంగున్ ||వినరే|| ✍ పురుషోత్తము చౌధరి Vinare Naru Laaraa – Manamula – Vedukalanu Meera = Mana Rakshakudagu – Mariyaa Thanayuni – Mahimalu Chevulaaraa || Vinare || Thana Kannanu Mundhu – Yoahaa – Nanu Natha Dimpondhu = Ghana Thara Magunu –Pravachanamu Ba –Lkenu Bhuu Janu Landhu Vinare Naru Laaraa || Vinare || Athadu Yordhaanu – Nadhiloa – Khyaathiga Nanu Dhinamun = Paathakulaku Baa –Pthisma Michchu Nedam – Prabhu Vachchati Karigen Vinare Naru Laaraa || Vinare || Nyaayamu Niluputakai – Prabhuni Vi Dheyatha Kanu Parachi Sreya Path Bon- Dhenuyoahaanuni Chetha Baapthismambu Vinare Naru Laaraa || Vinare || Paramandala Mapudu Theravam – Badi Paavuramu Gathin = Parisudhdhaathma Su-Bhaprabha Leenuchu – Prabhuvu Meedha Vraalen Vinare Naru Laaraa || Vinare || Aakaasamu Nundi – Kaligenu – Praakatamagu Ravamu = Naa Kithadu Priyambowkumaarudaa – Nandha Mondhi Ranuchu Vinare Naru Laaraa || Vinare || Anthata Mana Kartha - Parishuddhthma - Balamu Kalimin = Santhasamuna Mo - ksha Kushalavarthanu - Jatamganu Dhodagen || Vinare || Aa Nithya Suvaartha – Mana Medha – Lo Nidi Nammina Cho = Naanandha Mayam bamrutha Mesu Dha1- Yaanidhi Mana Kosangun || Vinare || ✍ Purushotthamu Choudhary akk 1
కామెంట్‌ను పోస్ట్ చేయండి