Dhevni samukha jeeva kavelelo ni peru vunnadha

దేవుని సముఖ జీవ కవిలెలో - నీ పేరున్నదా...ఆ..ఆ నీపేరున్నదా
1. జీవవాక్యము నిలలో చాటుచు - జీవితము లర్పించిరే
హత సాక్షుల కవిలెలోన - నీ పేరున్నదా...ఆ..ఆ నీపేరున్నదా "దేవుని"
2. ఆకాశమండలములలో తిరిగెడు - అందకార శక్తులను గెలిచిన
విజయవీరుల కవిలెలో - నీ పేరున్నదా...ఆ..ఆ నీపేరున్నదా "దేవుని"
3. పరిశుద్ధ యెరుషలేము సంఖ్య - పరిశుద్ధ గ్రంధము సూచించు
సర్వోన్నతుని పురములలో - నీ పేరున్నదా...ఆ..ఆ నీపేరున్నదా "దేవుని"
దేవుని సముఖ జీవ కవిలెలో - నీ పేరున్నదా...ఆ..ఆ నీపేరున్నదా
4. దేవుని సన్నిధి మహిమ ధననిధి - దాతను వేడి వరము పొందిన
ప్రార్ధన వీరుల కవిలెలో - నీ పేరున్నదా...ఆ..ఆ నీపేరున్నదా "దేవుని"
5. పరమునుండి ప్రభువు దిగగా - పరిశుద్ధులు పైకెగయునుగా
పరిశుద్ధుల కవిలెలో - నీ పేరున్నదా...ఆ..ఆ నీపేరున్నదా "దేవుని"

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.