599
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- ప్రేమతో వైద్యులును దాదులు పెంపు బొందగజేయుమా గ్రామ రోగుల గాంచి వారికి క్షేమమును దయ చేయుమా ||పరమ||
- భరత ఖండము నందు వైద్యపు బడులను నెలకొల్పుమా పరగ నీవే వైద్య శాలల బాలనంబు సల్పుమా ||పరమ||
- కుటి గ్రుడ్డి మూగ సాలల గూర్మితో దర్శించుమా యంటు రోగుల యాశ్రయముల నంటి పరామర్శించుమా ||పరమ||
- లెక్కలేని గర్భవతుల యక్కఱలను దీర్చుమా దిక్కు లేని బిడ్డలకు నీ దీవెనల సమకూర్చుమా ||పరమ||
- యంత్రశాలల గనులయందు నలయు వారలం బ్రోవుమా మంత్ర తంత్రము లందు జిక్కు న మాయకులను గావుమా ||పరమ||
- గ్రామ వైద్య సేవ జేసెడి ఘనుల బరిపాలించుమా గ్రామవాసుల గూల్చు వ్యాధుల గాంచి నిర్మూలించుమా ||పరమ||
- దురభిమాన మూఢ భక్తిని ద్వరగ దూర పరచుమా మరియు శుచిచే రోగములు మటు మాయ మగు నని కరపుమా ||పరమ||
- దేహశుద్ధిని జిత్తశుద్ధిని దేశ జనులకు గూర్చుమా దేహముల బర శుద్ధ మగు నీ దేవళములుగ మార్చుమా ||పరమ||
కామెంట్‌ను పోస్ట్ చేయండి