మద్యపాన ప్రియులు గాకుండి ప్రియులార

598

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    మద్యపాన ప్రియులు గాకుండి ప్రియులార మీరా మత్తులోనే మునిగి పోకుండి మద్యపానము చేయువారికి దథ్యముగ బ్రాప్తించు గీడులు కొద్దియైనన్ రుచిని జూడగ గోర దగ దని తలచుకొనుడి ||మద్య||

  1. రక్త మంతయు జెడును సుమ్మండి ప్రియులారా మీరు శక్తిహీనులగుదు రిల నుండి శక్యిహీనులె గాక మఱి మీ భక్తి దొలగి పోవునండి ముక్తిమార్గము దెలియదండి ముందు గతికి హీనమండి ||మద్య||

  2. బుద్ధిబలములు కొద్ది వౌనండి ప్రియులారా మీరు మొద్దు లగుదురనియు నమ్ముండి హద్దు మిరుచు ద్రాగువారికి గొద్దికాలమె జీవమండి శ్రద్ధగల్గి మద్యపానము రద్దు చేయుట తగినదండి ||మద్య||

  3. మచ్చునకును త్రాగబోకుండి ప్రియులార మీరీ తుచ్ఛమైన పనులు వీడుండీ హెచ్చుగా దిని త్రాగువారికి వచ్చు రోగము కుదురదండి చచ్చుటకు నిది హేతువని మది గచ్చితముగను దెలిసికొనుడి ||మద్య||

  4. ఆలుబిడ్డల మేలుగోరుండి ప్రియులారా వారి మేలు గోరిన ద్రాగం బోకుండి మేలు లెఱింగి పిలుచు క్రీస్తుని జాలిచూపులు దెలిసికొనుడి కాలయాపన జేయకుండి కర్త యేసని నమ్ముకొనడి ||మద్య||

  5. ఘన ధనములు నిలువబోవండి ప్రియులార నీచ తనము మీకు మూల మౌనండి తనవిదీర్చుదు మద్యమండి ఘనుల కొంపలు గూల్చు నండి ఘనముగా బ్రభువాక్యసారము వినయ

Post a Comment

కొత్తది పాతది