Premante ♥♥♥ప్రేమంటే???♥♥♥

♥♥♥ప్రేమంటే???♥♥♥


ఈ ప్రశ్న యూత్ ను అడిగామనుకోండి!,
ప్రేమంటే రెండు మనసుల కలయిక, ప్రేమంటే తీయటి జ్ఞాపిక, ప్రేమంటే ఓ మధురానుభూతి, ప్రేమంటే నమ్మకం,  లాంటి వేదాంత ధోరణి మాటలనుండి,
ప్రేమ గుడ్డిది, నడ్డిది, చెవిటిది లాంటి బరువైన మాటల వరకూ ఇంకా చాలానే చెబుతారు.

♡ మరి వాళ్ళ ప్రేమలో ఎంతవరకూ నిజాయితీ ఉంది?
♡ ప్రేమంటే అర్థం అంతేనా?
♡ ప్రేమను గురించి బైబిల్ ఏం చెబుతుంది?

మనం బైబిల్ చదివినపుడు, బైబిలంతటిలోనూ మనపై దేవునికున్న ప్రేమ స్పష్టంగా కన్పిస్తుంది.

♥దేవుడు మనకై రాసిచ్చిన ప్రేమలేఖ బైబిల్♥

మరి ప్రేమంటే బైబిల్ ఏమని నిర్వచిస్తోంది?

1కొరింథీ13:4-13  లో ప్రేమ యొక్క లక్షణాలు వివరించబడ్డాయి.

♥ ప్రేమ దీర్ఘకాలం సహించును

♥ ప్రేమ దయ చూపించును

♥ ప్రేమ మత్సరపడదు

♥ ప్రేమ డంబముగా ప్రవర్తింపదు

♥ ప్రేమ ఉప్పొంగదు

♥ ప్రేమ అమర్యాదగా నడవదు

♥ ప్రేమ స్వప్రయోజనాన్ని కోరుకొనదు

♥ ప్రేమ కోపపడదు

♥ ప్రేమ అపకారం చేయదు

♥ ప్రేమ సత్యమునందు సంతోషించును

♥ ప్రేమ అన్నిటికీ తాళుకొనును

♥ ప్రేమ అన్నిటినీ నమ్మును

♥ ప్రేమ అన్నిటినీ నిరీక్షించును

♥ ప్రేమ అన్నిటినీ ఓర్చుకొనును

♥ ప్రేమ శాశ్వతకాలముండును

♥ ప్రేమ దోషములన్నిటినీ కప్పును(సామెతలు10:12)

♥ ప్రేమ మరణమంత బలవంతమైనది(పరమగీతం8:6)

♥ ప్రేమ నిష్కపటమైనది(రోమా12:9)

♥ ప్రేమ పొరుగువారికి కీడుచేయదు(రోమా13:10)

♥ ప్రేమ క్షేమాభివృద్ది కలుగజేయును(1కొరంథీ8:1)

♥ ప్రేమ యధార్థమైనది(2కొరంథీ8:24)

♥ ప్రేమ పాపములను కప్పును(1పేతురు4:8)

♥ ప్రేమ ప్రాణమును పెట్టును(1యోహాను3:16)

♥ ప్రేమ భయమును పోగొట్టును(1యోహాను4:18)

చూశారా! ప్రేమ యొక్క లక్షణాలను దేవుడు ఎంత బాగా వివరించాడో!
వివరించడం మాత్రమే ఖాదు గానీ, ఆయన స్వయంగా అలాంటి ప్రేమను ఏ యోగ్యతా లేని మనయెడల చూపాడు.

అలాంటి ప్రేమను దేవుడు మనపై శాశ్వతముగా చూపించుచున్నాడు

♥ శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను(యిర్మియా31:3)

మనం కూడా అలాంటి ప్రేమను కలిగియుండాలని దేవుడు కోరుచున్నాడు.
దేవుడు చూపిన సంపూర్ణమైన ప్రేమను మనము చూపలేము(యోహాను5:41), ఆయన మన కొరకు ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం నడుచుకొనుటవలన మనం పరిపూర్ణ ప్రేమను కలిగియుండినవారమగుదుము.

♥ ఆజ్ఞల ప్రకారం నడుచుటయే ప్రేమ(2యోహాను1:6)

♥ ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమకలిగి యుండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే(రోమా13:10)


♥ ధర్మశాస్త్రమంతయూ నిన్నువలే నీ పొరుగువానిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమైయున్నది(గలతీ5:14)

లోకంలోని ప్రేమ స్వలాభమును కోరుతుందని బైబిల్ తెలియజేస్తుంది.పైకి ప్రేమ నటించుదురు గానీ అంతరంగమున లాభమును ఆశింతురు.

♥ నోటితో ఎంతో ప్రేమ కనపరుచుదురు గానీ, వారి హృదయం లాభమును ఆపేక్షించుచున్నది(యెహెజ్కేలు33:31)

ప్రేమ కలిగియుండకపోతే ప్రయోజనం లేదని బైబిల్ ఛెబుతోంది.

♥ ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనమేమియు లేదు(1కోరింథీ13: 3)

♥ అక్రమం విస్తరించడం వలన ప్రేమ చల్లారును(మత్తయి24:12)

       ♥  ♥            ♥ ♥
  ♥           ♥   ♥           ♥
  ♥               ♥               ♥
    ♥          JESUS          ♥
        ♥      LOVES     ♥
             ♥      U      ♥
                  ♥     ♥
                       ♥



♡ మీరు చేయు కార్యములన్నియు ప్రేమతో చేయుడి(1కొరంథీ16:14)

లోకంలోని ప్రేమకు, దేవుని ప్రేమకు ఎంతో తేడా ఉందని గమనించండి.


Refer:

* 2john1:5;
* 1john2:7; 3:22;
* john13:34; 15:12;
* mark12:31;
* mathew22:36,38

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.