a88

88

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    నమో యేసునాధా నాధా నమో జీవనాధా సమాన విరహిత సనాతనాత్మా సమున్నతోజ్వల ప్రశాంత ధామా ||నమో||

  1. స్థావర జంగమ జగమందున నీ శక్తి స్వరూపము ప్రతిఫలింపగ భూ వలయాకాశంబుల మించుచు భువన పాలనముజేసెటి ప్రభువా ||నమో||

  2. ధరణీ మానవ విమోచనార్థము కరుణను జీవము లొసగిన ప్రభువా పరమ కృపాభరితా మృతసారా వరసజ్జన హృదయాబ్జ విహారా ||నమో||

  3. సుందర మలయజ గంధ ధూపముల చందముననుమా వినుతులు గొను మా వందే దేవ దయాసందీప వందే శుభదానంద స్వరూపా ||నమో||

Post a Comment

కొత్తది పాతది