88
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
స్థావర జంగమ జగమందున నీ శక్తి స్వరూపము ప్రతిఫలింపగ భూ వలయాకాశంబుల మించుచు భువన పాలనముజేసెటి ప్రభువా ||నమో||
ధరణీ మానవ విమోచనార్థము కరుణను జీవము లొసగిన ప్రభువా పరమ కృపాభరితా మృతసారా వరసజ్జన హృదయాబ్జ విహారా ||నమో||
సుందర మలయజ గంధ ధూపముల చందముననుమా వినుతులు గొను మా వందే దేవ దయాసందీప వందే శుభదానంద స్వరూపా ||నమో||
إرسال تعليق