83
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
పతిత పావనమౌ వేల్పట అనాది దేవ సుతుడై యిల జేరి నాడట సతతము కడు దురి తతమోయుతమగు ప్రతి దేశమునకు హితభాస్కరుడట అతిలిత మోక్షో న్నత గుణగణుడట కుతలంబున స ద్గతి రహితంబగు పతితుల గావను మృతుడైనా డట అతిపుణ్య తను క్షత శోణితమును వ్రతముగ సిలువను నతడొసంగెనట మృతిని జయించుచు బ్రతికి లేచెనట మతి నమ్మిన మన గతి యితడేనట ||రారే||
తుదిలేని మహిమవాడట తనుగొల్చు సాధు హృదయుల సొమ్ము మూటట చెదరిన గొఱ్ఱెల వెదకవచ్చెనట చిదురుపలగు జన హృదయము లన్నిట బదిలముగా నె మ్మది నిడువాడట నదితట మఠ జన వదనముల స మ్మద శుభవార్తను బలికినవాడట సదయత నంధుల కక్షుల నిడెనట వెదకి బధిరులకు వీను లొసగె నట సదమల మోక్ష ప్రదుడగు విభుడట యిదిగో మనకిత డేలినవాడట ||రారే||
إرسال تعليق