87
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
దీన భక్త మందారా నమోనమో దోష శక్తి సంహారా నమోనమో దేవా యేసావతార నమోనమో దేవా గావో ||
దేవలోక ప్రదీపా నమోనమో భావలోక ప్రతాపా నమోనమో పావనాత్మ స్వరూపా నమోనమో దేవా గావో ||
వేదవాక్యాదర్శ మీవె నమోనమో వేద జీవమార్గం బీవె నమోనమో వేదవాక్కును నీవే నమోనమో దేవా గావో ||
శాపగ్రహివైతివి నాకై నమోనమో ప్రాణత్యాగివైతివి. నాకై నమోనమో ప్రాయశ్చిత్తమైతివి నాకై నమోనమో దేవా గావో ||
కామెంట్‌ను పోస్ట్ చేయండి