a83

83

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    రారే మన యేసు స్వామిని జూతము కోర్కె లూర ప్రియు లారా పేర్మిని గూరిమి భక్తుల విందుట భూరిద యామృత సారము లోలికెడు చారు కటాక్ష వి శాలేక్షణుడట నారకులగు నర నారీజనులకు దారక మొసగను దానె పిలుచునట దారుణ పాప మ హారణ్యమునకు గారుచిచ్చు గతి గంపడువాడట ఘోరదరిద్రత గూల్చెడివాడట సారం బగు తన సభకు మకుటమ ట ||రారే||

  1. పతిత పావనమౌ వేల్పట అనాది దేవ సుతుడై యిల జేరి నాడట సతతము కడు దురి తతమోయుతమగు ప్రతి దేశమునకు హితభాస్కరుడట అతిలిత మోక్షో న్నత గుణగణుడట కుతలంబున స ద్గతి రహితంబగు పతితుల గావను మృతుడైనా డట అతిపుణ్య తను క్షత శోణితమును వ్రతముగ సిలువను నతడొసంగెనట మృతిని జయించుచు బ్రతికి లేచెనట మతి నమ్మిన మన గతి యితడేనట ||రారే||

  2. తుదిలేని మహిమవాడట తనుగొల్చు సాధు హృదయుల సొమ్ము మూటట చెదరిన గొఱ్ఱెల వెదకవచ్చెనట చిదురుపలగు జన హృదయము లన్నిట బదిలముగా నె మ్మది నిడువాడట నదితట మఠ జన వదనముల స మ్మద శుభవార్తను బలికినవాడట సదయత నంధుల కక్షుల నిడెనట వెదకి బధిరులకు వీను లొసగె నట సదమల మోక్ష ప్రదుడగు విభుడట యిదిగో మనకిత డేలినవాడట ||రారే||

Post a Comment

కొత్తది పాతది