489
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- దిటముగ ప్రార్థన యను ఖడ్గము గని తిరుగు పిశాచము వెఱ చన్న పటుదీప్తులు గల ప్రభు శాస్త్రోక్తులు బహు సంశయ పం కము నింకించును ||మన||
- సాధు జనోత్తమ క్రైస్తవ సంగతి సమకూడిన మేలౌ నన్న శోధన లన్నిటి స్థిరముగ నోర్చెడి శుభమతి కన్నను సుఖమే మున్నది ||మన||
- తనువున దానను వానికి దురితము దగిలెడు విధి గనవలె నన్న యొనర గ క్రీస్తుని వధ్యాస్తంభము గని విశ్వాసము గట్టిగ బెంచిన ||మన||
- క్షమయును స్నేహము ప్రభుకడ నేర్చిన శత్రువు లిక భువి లేరన్న సమదృష్టి జగ జ్జనుల గనుంగొను సత్క్రైస్తవులకు సాధన మన దగు ||మన||
- పరమదయానిధి క్రీస్తుని బలమున బాప భరంబులు విడు నన్న పరిశుద్ధాత్ముని బంధుత్వంబున అరమర చీకటు లన్నియు దొల గును ||మన||
కామెంట్‌ను పోస్ట్ చేయండి