a490

490

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    మా యేసు క్రీస్తుని మఱుగు గల్గెనురా నా యాత్మ ఘనరక్షా నగమ నెక్కెను రా ||మా యేసు||

  1. ముందు నాలో పాప ములు జూడ బడెరా డెందము తా నన్ని టిని నొప్పుకొనెరా యందుకై బలు దుఃఖ మాత్మ జెందెనురా సందేహములు వీడు జాడ గన్గొనెరా ||మా యేసు||

  2. సువిశేష బోధనా చెవు లాలించెనురా అవివేక శాస్త్రోక్తు లంటు వీడెనురా నవసత్క్రైస్తవ గోష్ఠి భువి నా కబ్బెనురా వివిధము లగు వేల్పు ల్విష మైరిగదా ||మా యేసు||

  3. బాధగురువుల మోము ల్బహు లజ్జబడెరా గాధ మంత్రము లన్ని కడగండ్లయి చెడెరా శోధించి నాయాత్మ శుద్ధిగోరెనురా సాధించి ప్రభుక్రీస్తు శరణు జొచ్చెనురా ||మా యేసు||

  4. మతిలోని లోతు మ ర్మము గానబడెరా మితలేని ఘనపాప మే నిండు కొనెరా హితముగా తన జీవ మిచ్చె క్రీస్తుడురా మృతిచేత మన పాప వితతి గొట్టెనురా ||మా యేసు||

  5. కులగోత్రముల బుద్ధి కుటిలంబు దెగెరా బలవత్పిశాచ శృం ఖలము విఱిగెనురా సిలువ మోసినవాని చిర సౌఖ్యోన్నతిరా నెలవుగ నాలోన నిలచి యున్నదిరా ||మా యేసు||

  6. తనపోల్కె నొరుల గ న్గొన బ్రేమయ్యెనురా మనసు దేవునికి న ర్పణ సేయ బడెరా ఘన కృపశాంతులు గొనెను నెమ్మదిరా మనసు మార్పడి మోక్ష మహిమ గన్గొనెరా ||మా యేసు||

Post a Comment

కొత్తది పాతది