a489

489

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    మనసానందము బొందుట కన్నను మరి యే భాగ్యము గల దన్న అనుమానము లిక సఖిల సుఖంబులు దిన మొక గడికొక తీరై యుండును ||మన||

  1. దిటముగ ప్రార్థన యను ఖడ్గము గని తిరుగు పిశాచము వెఱ చన్న పటుదీప్తులు గల ప్రభు శాస్త్రోక్తులు బహు సంశయ పం కము నింకించును ||మన||

  2. సాధు జనోత్తమ క్రైస్తవ సంగతి సమకూడిన మేలౌ నన్న శోధన లన్నిటి స్థిరముగ నోర్చెడి శుభమతి కన్నను సుఖమే మున్నది ||మన||

  3. తనువున దానను వానికి దురితము దగిలెడు విధి గనవలె నన్న యొనర గ క్రీస్తుని వధ్యాస్తంభము గని విశ్వాసము గట్టిగ బెంచిన ||మన||

  4. క్షమయును స్నేహము ప్రభుకడ నేర్చిన శత్రువు లిక భువి లేరన్న సమదృష్టి జగ జ్జనుల గనుంగొను సత్క్రైస్తవులకు సాధన మన దగు ||మన||

  5. పరమదయానిధి క్రీస్తుని బలమున బాప భరంబులు విడు నన్న పరిశుద్ధాత్ముని బంధుత్వంబున అరమర చీకటు లన్నియు దొల గును ||మన||

Post a Comment

أحدث أقدم