488
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- ఆపదలలో మునిగి యడలుచుండగ నన్ను జేపట్టెను చింత చే జెడకు మనుచు వేపాకు కన్న నిది వెగటైన నా జిహ్వ తీపుగా నొనరించి స్ధిరపరచె నిపుడు ||ఘనమైన||
- ఘనమైన యాపదల కడలిలో బడి యున్న ఘనుడు నా దెస జూచి మనసు నొచ్చుకొనియె కనికరముచే నిన్ను గరుణింతు నిప్పుడె వెనుక జూడక తనదు వెంట రమ్మనెను ||ఘనమైన||
- కుల గోత్రములు వీడి కుటిలంబు దిగనాడి వలబడ్డ చేపవలె వదల కని పలికెన్ సిలువపై నసు విచ్చి బలహీన మెడలించి వలవలను కన్నీరు వల పోసినాడు ||ఘనమైన||
- పర్వతములపై గట్టు పట్టణమువలె నిన్ను నుర్విలో నుంచితి నుచి తంబుగాను సర్వజనులకు వెలుగు సాక్షిగా నీవుండి గర్వింప వలదనుచు ||ఘనమైన||
- సదమలం బగు జ్ఞాన సరణి యిదె నా మాట ముదముతో నమ్మినను మోక్ష మోసగెదను కదిసి సాతాను బలు కాడిక్రిందను బడిన విదలించి నరకమున వేతునని పలికెన్ ||ఘనమైన||
కామెంట్‌ను పోస్ట్ చేయండి