481
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- ఎండమావులే నీరనుచు మెండుగ బరుగిడు జింక కుప మండనై బలహీను నైతి ||చాలును||
- బూరుగ పండారగింప గోరి కాచికొని యున్నట్టి కీరసామ్య మైతి నయ్యో ||చాలును||
- దీపపు దీప్తి నాశించి యూపిరి విడు పురుగు రీతి బాపపు భ్రమచే నట్లయితి ||చాలును||
- పూలతో టయందు బెరుగు బూరుగ వృక్షంబునై నే మేలునకు మూలముగాన నైతి ||చాలును||
- చల్లిన వితనము ల్జంపు చౌట భూమి వలె నే గాగ సత్యము నిష్ఫలమయ్యొ నకట ||చాలును||
- మాయ సంత నైతి యేసు నాయక నన్విడక మార్పు జేయుమి నెన రుంచి నాపై ||చాలును||
- తొల్లి నన్ రప్పించినట్టి చల్లని సువార్త తేజ ముల్లమందు నుండ జేయ ||చాలును||
- మంచు పోల్కె నను జేయుటకై ముంచుమీ నీ రక్తాంబుధిలో బెంచుమి నీ వాక్సారము చే ||చాలును||
- చెడ్డ బిడ్డ నయ్య నేను దొడ్డ రక్షకుండ వీవు అడ్డులేక నన్ను బ్రోవు ||చాలును||
కామెంట్‌ను పోస్ట్ చేయండి