a481

481

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    చాలును లోక భోగములు చాలును చాలును మీనమును బట్టు గాలమైయున్న భోగములు ||చాలును||

  1. ఎండమావులే నీరనుచు మెండుగ బరుగిడు జింక కుప మండనై బలహీను నైతి ||చాలును||

  2. బూరుగ పండారగింప గోరి కాచికొని యున్నట్టి కీరసామ్య మైతి నయ్యో ||చాలును||

  3. దీపపు దీప్తి నాశించి యూపిరి విడు పురుగు రీతి బాపపు భ్రమచే నట్లయితి ||చాలును||

  4. పూలతో టయందు బెరుగు బూరుగ వృక్షంబునై నే మేలునకు మూలముగాన నైతి ||చాలును||

  5. చల్లిన వితనము ల్జంపు చౌట భూమి వలె నే గాగ సత్యము నిష్ఫలమయ్యొ నకట ||చాలును||

  6. మాయ సంత నైతి యేసు నాయక నన్విడక మార్పు జేయుమి నెన రుంచి నాపై ||చాలును||

  7. తొల్లి నన్ రప్పించినట్టి చల్లని సువార్త తేజ ముల్లమందు నుండ జేయ ||చాలును||

  8. మంచు పోల్కె నను జేయుటకై ముంచుమీ నీ రక్తాంబుధిలో బెంచుమి నీ వాక్సారము చే ||చాలును||

  9. చెడ్డ బిడ్డ నయ్య నేను దొడ్డ రక్షకుండ వీవు అడ్డులేక నన్ను బ్రోవు ||చాలును||

Post a Comment

أحدث أقدم