a483

483

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    పరదేశుల మో ప్రియులారా మన పుర మిదిగా దెపుడు నిజముగ ||బరదేశుల||

  1. చిత్రవస్తువులు చెల్లెడి యెకవి చిత్రమైన సరిత లోకము ||బరదేశుల||

  2. సంత గొల్లు క్షమ సడలిన చందం బంతయు సద్దణగున్ నిజముగ ||బరదేశుల||

  3. స్థిర మని నమ్మకు ధర యెవ్వరికిని బరలోకమె స్థిరము నిజముగ ||బరదేశుల||

  4. మేడలు మిద్దెలు మేలగు సరకులు పాడైకనబడవే నిజముగ ||బరదేశుల||

  5. ధర ధాన్యంబులు దరగక మానవు పనిపాటలు పోయె నిజముగ ||బరదేశుల||

  6. ఎన్నినాళ్ళు మన మిలలో బ్రతికిన మన్నై పోవునుగా దేహము ||పరదేశుల||

  7. వచ్చితి మిచటికి వట్టి హస్తముల దెచ్చిన దేదియు లే దు గదా ||పరదేశుల||

  8. ఎట్లు వచ్చితిమి యీ లోకమునకు అట్లు వెళ్లవలయున్ మింటికి ||బరదేశుల||

  9. యేసు నందు వి శ్వాసం బుంచిన వాసిగ నిను జేర్చున్ బరమున ||బరదేశుల||

  10. యేసే మార్గము యేసే సత్యము యేసే జీవముగా నిజముగ ||బరదేశుల||

Post a Comment

أحدث أقدم