482
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- ఎన్ని దినములు బ్రతుకు నేమి సౌఖ్యంబు అన్ని విధముల జూడ నధిక కష్టంబు కన్ను మూసిన నాడు మన్ను పాలౌదుము మున్ను జాగ్రత్తనొంద కున్న నష్టము గల్గు ||బదరే||
- ధరణి బ్రతుకును గోర మరణ భయంబు దరీలేని చింతల దగిలి నిత్యంబు పరి పరి విధముల పరుగు లెత్తుట లేల నిరతంబును సువార్త సరణి గన్గొని వడిగ ||బదరే||
- ధనము సంపాదించి ఘన మదిక మున్న తనువే సతము గాదు అను భవము సున్న ఇను డెంద మావు లను గోర నేపాటి తనివి దీరు నిచ్చో టను నా పాటే దీరు ||బదరే||
- పరలోక మార్గం బిరుకై గన్పడును జొరగా సంకటములు నెరిజుట్టుకొనును పరమ జనకుని కృపా వరము తోడుగ నున్న వెరపు నొంద మింక సరకు సేయుము పద ||బదరే||
- ఇహ స్నేహముల మన కికజాలు జాలు బహు దినంబులు సేయం బడె నేమి మేలు మహిమ దూతల స్నేహ మమరు నచ్చట మనకు అహహా యేసుని జూడ నధిక సంతోషంబు ||పదరే||
- మనల తోడ్కొని పోవ ఘనుడు యెహోవా యనంబు తన శుద్ధా త్మను నిచ్చి కావ నెనలేని యడ్డంకు లను దాటింపను గృప గనుపర్చి తోడుగ నునిచె వేగము గూడి ||పదరే||
కామెంట్‌ను పోస్ట్ చేయండి