a44

44

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    సకల జగజ్జాల కర్తా భక్త సంఘ హృదయ తాప హర్తా యకలంక గుణమణి నికర పేటీ కృత ప్రకట లోకచయ పరమ దయాలయ ||సకల||

  1. నాదు నెమ్మది తొలగించుచు బ్రతి వాదు లీమెయి నెంతో పాదుకొన్నారు బాధలందైనను సాధులభ్రోవ ననాది యైనట్టి నీవాధారమైయుండ ||సకల||

  2. దినకృత్యముల గష్టమంత చీకటినినే నీ కడ భక్తి మనవిజేయ వినుచు నా కష్టము వెస నష్టముగ జేయ ఘనముగ నాయందు గరుణ జేసితివి ||సకల||

  3. తమ కాపు నన్ను కాపాడగ నేనుత్తమ నిద్ర బొందితి దనివిదీర కొమ రొప్ప మేల్కొన్న గూలిన మృత్యు భయముబొంద నా డెంద మందు నెల్లప్పుడు ||సకల||

  4. రాతిరి సుఖనిద్ర జెంద జేసి రక్షింప నను నీకె చెల్లు ప్రాతస్తుతుల్ జేయ బగలు జూచు తెల్వి ఖ్యాతముగా నాకు గలుగజేసితివి ||సకల||

Post a Comment

కొత్తది పాతది