43
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
నిదురయందు నేడు క్షేమ మొదవ గాచినాడు సూర్యుడుదయ మాయెజూడు నీ హృదయమున సదమల పదవులుదయింప ||శ్రీ యేసు||
అంధకార మణగెన్ హృదయాంధకార మణగెన్ ప్రభు నందు దెలివి గలుగన్ నిబంధనలు డేందమున కందముగ గూర్చి ||శ్రీ యేసు||
కంటిపాప వలెను నిను గాయువాని దయను గను గొంటివి స్తోత్రమును జేయు మింటి కినిమంటికన్నింటికిని కర్తయని ||శ్రీ యేసు||
కలకల ధ్వనిజేయు పక్కిగములు లయను గూయు సర్వములు ప్రభు స్తుతిజేయు నీ వలయక సొలయక వెలయగ బాడు ||శ్రీ యేసు||
సేవయందు నీకు మంచి యీవు లిడుపరాకు గల భావముబడ బోకు నేడు కానవే కావవే కావవే యంచు ||శ్రీ యేసు||
పగటివార మంచు నిష్ఫ్లపు గ్రియలు ద్రుంచు యుగ యుగములు జీవించు పురికెగయ నీ దిగులు విడు తగు నమ్మకమున ||శ్రీ యేసు||
మింటి నంట బాడు నీ యొంటి బలిమి నేడు ప్రభు నంటి యుండ వాడు నిన్నొంటి నెన్నంటి కెన్నింటికిన్వీడడు ||శ్రీ యేసు||
కామెంట్‌ను పోస్ట్ చేయండి