26
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధి కేగుదము సత్ప్రభు నామము కీర్తనలన్ సంతోష గానము చేయుదము ||రండి||
మన ప్రభువే మహాదేవుండు ఘన మాహాత్మ్యముగల రాజు భూమ్య గాధపులోయలును భూధర శిఖరము లాయనవే ||రండి||
సముద్రము సృష్టించె నాయనదే సత్యుని హస్తమే భువిజేసెన్ ఆయన దైవము పాలితుల మాయన మేపెడి గొఱ్ఱెలము ||రండి||
ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రొక్కుదము ఆయన మాటలు గైకొనిన నయ్యవి మనకెంతో మేలగును ||రండి||
తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుగాక ఆదిని నిప్పుడు నెల్లప్పుడు నయినట్లు యుగముల నౌను ఆమేన్ ||రండి||
కామెంట్‌ను పోస్ట్ చేయండి