a27

27

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక కలుగు నున్నతమైన ఘన స్థలములందున నిలకు సమాధానం నరుల కాయన దయ ||కలుగును||

  1. ప్రభువైన దేవా పరమరాజా సర్వపరిపాలా పరిపూర్ణ శక్తిగల పరమ జనక నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము ||కలుగును||

  2. మహిమపర్చుచు ఆరాధించు చున్నాము నిన్ను మహిమాతిశయమును మది దలంచియు నీకు మహిని మా స్తుతి కృతజ్ఞత నిచ్చుచున్నాము ||కలుగును||

  3. ఏక కుమారా యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయు ఏక దేవుని గొఱ్ఱె పిల్ల మమ్మును కనికరించుము చల్లగ ||కలుగును||

  4. లోకపాపములు మోయుచు బోవు యేసు రక్షకా వాసిగ జనకుని కుడివైపున గూర్చుండి యేసూ మా ప్రార్థన నాలించి కనికరించు ||కలుగును||

  5. పరిశుద్ధుడవు ప్రభుడవు నీవో ప్రభువైన క్రీస్తూ పరిశుద్ధాత్మతో తండ్రి యైన దేవునియందుబరిపూర్ణ మహిమతో బ్రబలుచున్నామవామేన్ ||కలుగును||

Post a Comment

కొత్తది పాతది