23
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
పాపకూపమందు నుండగా బాపావిమోచ దాపుజేర్చి కాపు జూపితి శాపగ్రస్తులైన మా శాపము విముక్తిజేయ నీ పవిత్ర రక్తమే నా ప్రాపుగా నొసంగితివి ||యెటుల||
భార భరితమైన యాత్మల భారమున దీసి భూరి సౌఖ్యములతో నింపను భారకుండ ఘోరమైన శ్రమలనొంది మరణమొంది తిరిగిలేచి నీవు ధాత్రి మహిమ నొందినట్టి దేవా ||యెటుల||
నీతిహీనులమై యుండగా నో కర్త మాదు బీతులన్నిబాపి నీ కృపన్ నీతి రక్షణవస్త్రములను భాతిగ ధరింపజేసి భూతలంబునందు నిన్ను ఖ్యాతిగ సేవింపజేసితి ||యెటుల||
నిన్నుజేరి నిర్చలుండనై యీ భూమియందు నిన్ను బోలి నడుచుకొనుటకై తిన్నని మార్గమును జూపి అన్ని కీడులను జయింప బన్నుగ విమలాత్మశక్తి నున్నతముగ నిడిన యేసూ ||యెటుల||
పరమ రాజ్యమందు నిరతము నీతోడనుండ కరుణతోడ నెంచుకొంటివి తిరిగి వచ్చి మమ్మును మీ చిరప్రకాశ పురమునందు త్వరగ జేర్చియందు సుఖము దిరముగా నొసంగుదేవ ||యెటుల||
కామెంట్‌ను పోస్ట్ చేయండి