a26

26

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    రండి యుత్సహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే||

  1. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధి కేగుదము సత్ప్రభు నామము కీర్తనలన్ సంతోష గానము చేయుదము ||రండి||

  2. మన ప్రభువే మహాదేవుండు ఘన మాహాత్మ్యముగల రాజు భూమ్య గాధపులోయలును భూధర శిఖరము లాయనవే ||రండి||

  3. సముద్రము సృష్టించె నాయనదే సత్యుని హస్తమే భువిజేసెన్ ఆయన దైవము పాలితుల మాయన మేపెడి గొఱ్ఱెలము ||రండి||

  4. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రొక్కుదము ఆయన మాటలు గైకొనిన నయ్యవి మనకెంతో మేలగును ||రండి||

  5. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుగాక ఆదిని నిప్పుడు నెల్లప్పుడు నయినట్లు యుగముల నౌను ఆమేన్ ||రండి||

Post a Comment

أحدث أقدم