29
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
నిన్ను స్తుతియించుచు నీవు ప్రభుడ వని చెన్నుమీరగ నమ్మియున్నాము సత్ర్పభో||
నిత్య మా తండ్రి భూలోకం బంతయు నిన్ను భక్తితో నారాధించుచున్నది మా ప్రభో||
దేవ లోకాధిపతులు దూతల సమూహము దేవాయని కొల్చుచున్నారు నిన్ను బ్రభో||
పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా పరలోక సేనాధిపతివైన మా ప్రభో||
ఇహలోకం బంతయు బరలోకం బంతయు నీ మహి మహాత్మ్యముతో నున్నవని ప్రభో||
కెరూబులను దూతలు సెరూపులను దూతలు తిరముగా నిన్ గొనియాడుచున్నారు మా ప్రభో||
నీ దపొస్తలుల మహిమగల సంఘము ప్రోదిగా నిన్నుతించుచున్నది మా ప్రభో||
నిత్యము ప్రవక్తల యుత్తమ సంఘము సత్యముగ నిన్నుతించుచున్నది మా ప్రభో||
ధీర హత సాక్షుల వీర సైన్య మంతయు సారెకు నిన్నుతించుచున్నది మా ప్రభో||
నిత్య మహాత్మ్యముగల తండ్రి వైన నిన్నును నీదు పూజ్యుడగు నిజ అద్వితీయ సుతినిన్||
ఆదరణ కర్తయైనట్టి శుద్ధాత్ముని నంతట నుండు సభ యొప్పుకొనునునిన్ బ్రభో||
కామెంట్‌ను పోస్ట్ చేయండి