a9

9

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    ప్రబలముగనే ప్రస్తుతించెద ప్రభుని కృపలన్ని ప్రతి దినము నిను ప్రచురపరచెద ప్రభుడ నావిభుడా ||ప్ర||

  1. పొందుగోరి నా యందు నిలిచిన బంధుమిత్రుడవు మందమతి కా నందమొసగిన మహిమతేజుడవు ||ప్ర||

  2. చింతదీర్చి నా భ్రాంతి మార్చితి వెంత వింతదియో స్వాంతమున కడు శాంతిగూర్చితి వెంత కరుణదియో ||ప్ర||

  3. నీతి కరపిన జాతి మరపిన ఖ్యాతి యేసునిదే నీరసుడ నను గారవించిన నీతిరాజితడే ||ప్ర||

  4. జీవమిచ్చిన జావవచ్చిన దేవసుత నీవే జీవదాయక బ్రోవరా యిక జాలమేలనురా ||ప్ర||

  5. నిమిషనిమిషము నిను భజించెద నెమ్మనంబునను శమదమాది సుగుణశోభిత సమ్మదిని నిమ్మా ||ప్ర||

Post a Comment

కొత్తది పాతది