8
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
ముదముతో నిర్మాణ్కుండగు మూల కర్తను బాడరే వదన మీక్ష్మాన్వంచి దేవుని వందనముతో వేడరే ||సర్వ||
వేదపారాయణము సేయుచు విశ్వ మంత జయింపరే సాదరముగా దేవునిక మీ స్వాంతమున బూజింపరే ||సర్వ||
ఎదను విశ్రాంతిన్ పరేశుని హెచ్చుగా నుతిజేయరే సదమలంబగు భక్తితో మీ సర్వ మాయన కీయరే ||సర్వ||
చావు పుట్టుక లేనివాడుగ సంతతము జీవించును ఈవు లిచ్చుచు దన్ను వేడు మహేష్టులను రక్షించును ||సర్వ||
దాసులై దేవునికి నెదలో దర్పమును బోగాల్పరే యేసుక్రీస్తుని పుణ్యవస్త్రము నే మరక మైదాల్పరే ||సర్వ||
కామెంట్‌ను పోస్ట్ చేయండి