9
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
పొందుగోరి నా యందు నిలిచిన బంధుమిత్రుడవు మందమతి కా నందమొసగిన మహిమతేజుడవు ||ప్ర||
చింతదీర్చి నా భ్రాంతి మార్చితి వెంత వింతదియో స్వాంతమున కడు శాంతిగూర్చితి వెంత కరుణదియో ||ప్ర||
నీతి కరపిన జాతి మరపిన ఖ్యాతి యేసునిదే నీరసుడ నను గారవించిన నీతిరాజితడే ||ప్ర||
జీవమిచ్చిన జావవచ్చిన దేవసుత నీవే జీవదాయక బ్రోవరా యిక జాలమేలనురా ||ప్ర||
నిమిషనిమిషము నిను భజించెద నెమ్మనంబునను శమదమాది సుగుణశోభిత సమ్మదిని నిమ్మా ||ప్ర||
إرسال تعليق