a5

5

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    నీతిగల యెహోవా స్తుతి మీయాత్మతో నర్పించుడి మీయాత్మతో నర్పించుడి దాతయౌ మన క్రీస్తు నీతిని దాల్చుకొని సేవించుడి ||నీతి||

  1. చదల బుడమియు రవియు జలధియు నదులు గిరులును జక్కగా సదమలంబగు దైవనామము సర్వదా నుతిజేయను ||నీతి||

  2. సర్వశక్తుని కార్యముల కీ సర్వరాష్ట్ర్రము లన్నియు గర్వములు విడి తలలు వంచుచు నుర్విలో నుతిజేయను ||నీతి||

  3. గీత తాండవ వాద్యములచే బ్రీతి పరచెడు సేవతో పాతకంబులు పరిహరించెడు దాతనే సేవించుడి ||నీతి||

  4. పరమదూతలు నరులు పుడమిని మొరలుబెట్టుచు దేవుని పరము నందున్నట్టి యేసుని పాదములు సేవింతురు ||నీతి||

  5. ఇలను భక్తుల గూడుకొనియా బలము గల్గిన దేవుని వెలయు స్తుతి వే నోళ్లతోడను విసుగు జెందక జేయుడి ||నీతి||

  6. ఆత్మ నీవిక మేలుకొని శుద్ధాత్మ యేసుని దండ్రిని త్రిత్వమగునా యేక దేవుని హర్షమున సేవింపవే ||నీతి||

Post a Comment

أحدث أقدم