6
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
మట్టితోనే మమ్ము నెల్ల మానవులుగ సృజించెను ఇట్టి శక్తుండౌ ప్రభు న్మే మెచ్చుగా మది నెంతుము ||భీకరుండౌ||
ఏరితోడు లేక మము సర్వేశ్వరుడు సృష్టించెను ధారుణిం దా నొక్కడే మా దైవమని పూజింతుము ||భీకరుండౌ||
పుట్టగిట్టంజేయదానై నట్టి దేవుని శక్తిని బట్టుగా లోకస్థులారా ప్రస్తుతింపరె భక్తిని ||భీకరుండౌ||
మేటి సంగీతంబులుపై మింట నారవ మొందను జాటరే వేవేల నోళ్ళన్ సన్నుతుల్ ప్రభు వందను ||భీకరుండౌ||
మిక్కిలి కష్టంబులతో మిత్తికిని బాల్పొందను దిక్కులేని గొఱ్ఱె లట్లు దిరుగజేర్పన్ మందను ||భీకరుండౌ||
إرسال تعليق