a72

72

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    మంగళముబాడరె క్రీస్తునకు జయ మంగళముబాడరె యో ప్రియులారా మంగళము బాడరెర్ మంగళము బాడి దు స్సంగతిని వీడి ప్రభు సంగులను గూడి మది బొంగుచు జెలంగుచును ||మంగళము||

  1. రాజులకు రాజని దూతలచేత పూజగొనువాడని తేజమున సూర్యునికి దీప్తి నిడు సద్గుణ వి రాజితుని సాధుజన రక్షకుని పక్షముగ ||మంగళము||

  2. కరుణ గల వాడని పాపులబ్రోచు బిరుదుగొనినాడని మరణమును దాని బరి మార్చు ఘన శక్తిగల పరమ గురుడితదె మన పాలి వాడని శుభ||మంగళము||

  3. సంగీతము పాడుచు సువార్త ప్ర సంగముల గూడుచు నింగికిని భూమికిని నిత్యముగ నేల దగు శృంగారపు రాజునకు క్షేమ మగు ఆమేనిని||మంగళము||

Post a Comment

కొత్తది పాతది