a71

71

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    నీవు నా దేవుండవై యు న్నావు యేసు నాధ నీవిల బ్రోవవే నన్ను గావవే ||నీవు||

  1. పాప మానవ శాప భారము నోపి సిల్వను బడిన క్షేమా ధిపతి సర్వ భూపతి ||నీవు||

  2. శ్రేయమౌ కా యంబు భక్తుల కీయ సిద్ధము జేయు యేసు నాయకా మోక్ష దాయకా ||నీవు||

  3. జీవ మారెడి త్రోవ నేబడి చావనై యున్నాను పతిత పావనా యాత్మ జీవనా ||నీవు||

  4. జాగుసేయక బాగుసేయను రాగదె నే ఘోర పాప రోగిని దఃఖ భాగిని ||నీవు||

  5. పాపమున నా రూపు మాపితి ప్రాపు నీవని నమ్మితిని నను లేపనా కృపను జూపవా ||నీవు||

Post a Comment

కొత్తది పాతది