a47

47

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    లేచి స్తుతింప బూనుడి లోకేశ్వరుని లేచి స్తుతింప బూనుడి లేచి స్తుతించెదము చూచుచు మనలను బ్రోచి ప్రేమతో గరము జాచి కాపాడు విభుని ||లేచి||

  1. రాత్రి జాముల యందున రంజిలదన నేత్రము తెరచినందున మైత్రితో దేవ దయకు పాత్రులమైతిమి శ్రోత్రముల కింపుసబ విత్ర గీతము పాడుచు ||లేచి||

  2. నిదురభోయిన వేళను నిర్మలమైన హృదయము మనకు నియ్యను ముదముతో నిదురబొంది యుదయాన లేచితిమి సదయుడైన క్రీస్తు పదముల దరిజేర ||లేచి||

  3. నిగమ వేద్యుడు మనలను దనలోన నీ పగలు కాపాడబూనెను దిగులు బొందక పనులు తెగువతో జరుపుకొనుచు వగపుతో లేచి మ్రొక్కి మిగుల శుద్ధాత్మనడిగి ||లేచి||

  4. నేటి పాఠములయందు నిర్భయముగ దాటివెలసి యుందు సూటిగ నీదు ఱెక్కల చాటుగను నిలుపు మనుచు నీటుగా నెల్లవార నిత్యము ప్రేమనేల ||లేచి||

Post a Comment

కొత్తది పాతది