47
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
రాత్రి జాముల యందున రంజిలదన నేత్రము తెరచినందున మైత్రితో దేవ దయకు పాత్రులమైతిమి శ్రోత్రముల కింపుసబ విత్ర గీతము పాడుచు ||లేచి||
నిదురభోయిన వేళను నిర్మలమైన హృదయము మనకు నియ్యను ముదముతో నిదురబొంది యుదయాన లేచితిమి సదయుడైన క్రీస్తు పదముల దరిజేర ||లేచి||
నిగమ వేద్యుడు మనలను దనలోన నీ పగలు కాపాడబూనెను దిగులు బొందక పనులు తెగువతో జరుపుకొనుచు వగపుతో లేచి మ్రొక్కి మిగుల శుద్ధాత్మనడిగి ||లేచి||
నేటి పాఠములయందు నిర్భయముగ దాటివెలసి యుందు సూటిగ నీదు ఱెక్కల చాటుగను నిలుపు మనుచు నీటుగా నెల్లవార నిత్యము ప్రేమనేల ||లేచి||
إرسال تعليق