a51

51

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    దినము గతియించెను దిననాధుడ పరాద్రి వెనుకడాగె ని కమా మునిమాపు సంస్తవము గొనుము సంప్రీతిమై ఘనుడ దేవా ||దినము||

  1. సరవినంబరవీధి సంజ కెంజాయలు మురువుజూపె ప్రభువా దొరము నీ ముఖకాంతి కిరణ జాలము మాపై నెఱపరమ్ము ||దినము||

  2. కటికి చీకటులు దిక్తటముల గలిపియు త్కటములైన నీ చెం గట నున్న నెట్టి సంకటమేని మమ్ము దాకుటకు జంకు ||దినము||

  3. తలపువలనను నోటి పలుకువలనను జెనటి పనులవల్ల మేము వలచి చేసిన పాపముల నెల్ల క్షమియింపుమ లఘక్షాంతి ||దినము||

  4. ముమ్మరమ్మగు శోధ నమ్ములపై విజయమ్మునొంద నీ దినమ్ము మాకు సామర్ధ్యమొసగితివి వంద నమ్ము దేవ ||దినము||

  5. ఈ దినము మాకు సమ్మోదంబుతో నిచ్చి యాదుకొన్న వరమౌ నీ దివ్యదానముల కై దేవ! మా కృతజ్ఞతను గొమ్ము ||దినము||

  6. అలసిన మా దేహములకు వలసిన నిదుర గలుగజేసి నీదూ తల హస్తములలో మమ్ములను దాచుము భద్రముగను దేవ ||దినము||

  7. అరుణోదయముననిన్నర్చించు కొఱకు నీ కరము సాచి మమ్ము త్వరగా మేల్కొల్పుము స్వాస్థ్య ప్రదాతవై పరమదేవ ||దినము||

  8. దాత వీవె లోక త్రాత వీవె మాకు నేత వీవె యేసు నీతి సూర్యుండవి ఖ్యాతి మహిమలు నీకె కలుగుగాక ||దినము||

Post a Comment

కొత్తది పాతది