456
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- సురుచిరమగు మరియ సూనుని యాజ్ఞలు శిరమున నిడికొందును మరియ మనసుతో మర్తమ్మ కరములతో బరమ సౌఖ్యము బొంద భక్తితో సేవింతు ||సంత||
- నారాజు సేవ దు ర్భరమై బాధగ నున్న భారంబుగను దోచదు సారెసారెకు దనదు చక్కని చిఱునవ్వు వారించి భారమున్ ధీరత నొస గును ||సంత||
- కారుణ్యమున నాదు కల్మషమయ హృదయ భారములను మోసితి ఆ రాజ్యమునగల యాస్తికై నా చిత్త మాలసింపగ నెత్తి యందే స్థిరముగ నుంచు ||సంత||
- ఈ యుర్వి నేజేయు సేవకు ఫలములు నీ చోట గనుగొందునే కాయం బీధర కర్మలం గరపిన నా యాస్తి నా హృదయ మాలో కమున మండు ||సంత||
కామెంట్‌ను పోస్ట్ చేయండి